Homeరంగారెడ్డిమధుయాష్కిని మర్యాదపూర్వకంగా కలిసిన డీసీసీ అధ్యక్షురాలు పారిజాత

మధుయాష్కిని మర్యాదపూర్వకంగా కలిసిన డీసీసీ అధ్యక్షురాలు పారిజాత

మధుయాష్కిని మర్యాదపూర్వకంగా కలిసిన డీసీసీ అధ్యక్షురాలు పారిజాత

రంగారెడ్డి | వారధి న్యూస్: రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా ఇటీవల నియమితులైన చిగురింత పారిజాత నరసింహారెడ్డి శుక్రవారం ఆలిండియా ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ చైర్‌పర్సన్‌, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్‌ను బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన మధుయాష్కి గౌడ్‌కు పారిజాత నరసింహారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.


జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి మధుయాష్కి గౌడ్‌ను కలిసిన పారిజాత నరసింహారెడ్డి, పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడం, నాయకులు, కార్యకర్తలతో సమన్వయంతో ముందుకు సాగడం, పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిపారు.


పారిజాత నరసింహారెడ్డి నియామకంపై మధుయాష్కి గౌడ్‌ అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆమెను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అధ్యక్షురాలిగా కొత్త బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని, నాయకులు, కార్యకర్తలను కలుపుకొని పనిచేయాలని సూచించినట్లు పేర్కొన్నారు.


ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ శ్రేణుల సమన్వయం తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని పారిజాత నరసింహారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News

- Advertisment -
Google search engine

Most Popular

హైదరాబాద్

- Advertisment -
Google search engine
- Advertisment -
Google search engine