
ప్రకాశం జిల్లా | వారధి న్యూస్:ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లి గ్రామంలో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన సుమారు 25 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి.
యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి చంద్రశేఖర్ వైఎస్సార్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఒకేసారి 25 కుటుంబాలు పార్టీలో చేరడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ చేరికలతో దోర్నాల మండలంలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగిందని వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దోర్నాల మండలానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులతో పాటు ఎగువ చెర్లోపల్లి, చిలకచర్ల గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.














