Homeతెలంగాణస్నాప్‌చాట్‌ ద్వారా డ్రగ్స్ విక్రయం.. ముగ్గురు డ్రగ్స్ సరఫరాదారుల అరెస్ట్!

స్నాప్‌చాట్‌ ద్వారా డ్రగ్స్ విక్రయం.. ముగ్గురు డ్రగ్స్ సరఫరాదారుల అరెస్ట్!

Three drug suppliers arrested for selling drugs through Snapchat in a drug trafficking case

హైదరాబాద్ | వారధి న్యూస్:సోషల్ మీడియాను వేదికగా చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. స్నాప్‌చాట్‌ ద్వారా గంజాయి, ఓజీ కుష్ సరఫరా చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. మణికొండలోని ల్యాంకో హిల్స్ ప్రాంతంలో కారులో డ్రగ్స్ తరలిస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1.240 కిలోల గంజాయి, 16.59 గ్రాముల ఓజీ కుష్‌ను స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు ‘OGdude420’, ‘Dude OG 420’ పేర్లతో స్నాప్‌చాట్‌ ఖాతాలను నిర్వహిస్తూ కస్టమర్లకు మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇప్పటివరకు సుమారు 800 నుంచి 900 మంది వినియోగదారులకు డ్రగ్స్ విక్రయించినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ అక్రమ దందాపై పోలీసులు నిఘా పెంచారు. ఈ వ్యవహారం వెనుక మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News

- Advertisment -
Google search engine

Most Popular

హైదరాబాద్

- Advertisment -
Google search engine
- Advertisment -
Google search engine