Homeరాజకీయాలుకాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువ.. నేతల వ్యాఖ్యలపై ఏఐసీసీ పరిశీలన: మహేశ్ కుమార్ గౌడ్

కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువ.. నేతల వ్యాఖ్యలపై ఏఐసీసీ పరిశీలన: మహేశ్ కుమార్ గౌడ్

Telangana Congress President Mahesh Kumar Goud speaking about democracy in the Congress party

కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యానికి అధిక ప్రాధాన్యత ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏఐసీసీ పరిశీలిస్తోందని తెలిపారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సరైన సమయంలో అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

గతంలో కొండా సురేఖ విషయంలోనూ వెంటనే చర్యలు తీసుకోలేదని, పలుమార్లు పరిశీలించిన తర్వాతే ఏఐసీసీ నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. ప్రస్తుతం రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యల వ్యవహారాన్ని కూడా పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తోందని వెల్లడించారు.

తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీ లేదు

ఆంధ్రప్రదేశ్‌పై వస్తున్న జలదోపిడీ ఆరోపణలపై స్పందించిన మహేశ్ కుమార్ గౌడ్.. తెలంగాణకు కేటాయించిన నీటి వాటాలో ఒక్క బొట్టు కూడా వదులుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీపడదని, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే అవసరం తమకు లేదని అన్నారు.

కేటీఆర్ ఆరోపణలకు మహేశ్ గౌడ్ కౌంటర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలపైనా మహేశ్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. ఫార్ములా ఈ-కార్ రేసు, కాళేశ్వరం ప్రాజెక్టు, భూ వ్యవహారాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఢిల్లీకి డబ్బులు పంపాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. రాహుల్ గాంధీ సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ, దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను తెలుసుకున్న తర్వాతే విమర్శలు చేయాలని కేటీఆర్‌కు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News

- Advertisment -
Google search engine

Most Popular

హైదరాబాద్

- Advertisment -
Google search engine
- Advertisment -
Google search engine