
అచ్చంపేట | వారధి న్యూస్:ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల్లో సాధించిన విజయాలు రాజకీయంగా చర్చనీయాంశంగా నిలిచాయి. ప్రజల తీర్పు ప్రజాస్వామ్యానికి అసలైన బలమని ఈ ఫలితాలు మరోసారి గుర్తుచేశాయి.
ఎన్నికల సమయంలో ఎన్నో విమర్శలు, ఎన్నో రాజకీయ చర్చలు జరిగాయి. కానీ చివరకు ప్రజలు తమ ఓటు ద్వారా నిర్ణయం వెల్లడించారు. ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి వంటి అంశాలే రాజకీయాల్లో కీలకమని ఈ ఫలితాలు తెలియజేస్తున్నాయి.
మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకున్న దూరదృష్టి, యువ నాయకుడు నారా లోకేష్ గారి పారిశ్రామిక, ఉపాధి కల్పన ప్రయత్నాలు, పవన్ కళ్యాణ్ గారి ప్రజా నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారం.. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై కొత్త ఆశలు కల్పిస్తున్న అంశాలు.
మాకు రాజకీయాలు అంటే కేవలం పదవులు కాదు.. ప్రజల మధ్య ఉండటం, ప్రజల సమస్యలపై స్పందించడం, పార్టీ సిద్ధాంతాల కోసం నిలబడటం. తెలుగుదేశం పార్టీ అంటే మాకు ఒక రాజకీయ గుర్తింపు మాత్రమే కాదు.. ఎన్టీఆర్ గారు చూపించిన మార్గం, చంద్రబాబు గారు కొనసాగిస్తున్న అభివృద్ధి ఆలోచనలతో ముడిపడిన ప్రయాణం.
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి ప్రయత్నాలు నిరంతరం కొనసాగాలి. అమరావతి రాజధాని నిర్మాణం ముందుకు సాగాలి. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి. యువతకు ఉద్యోగాలు రావాలి. రైతులకు భరోసా కలగాలి. ఇదే మా ఆకాంక్ష.
అలాగే తెలంగాణలోనూ తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలనే సంకల్పంతో పనిచేస్తాం. యువతను కలుపుకొని పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మా బాధ్యతను విస్మరించం.
పార్టీ కోసం పనిచేసే కార్యకర్తకు పదవుల కంటే ప్రజల అభిమానం ముఖ్యం. నాయకత్వంపై నమ్మకంతో ముందుకు సాగడం, పార్టీ జెండాను గౌరవంగా నిలబెట్టడం మా బాధ్యత.












