Homeరాజకీయాలుకమ్మవారిపల్లి ఎంపీటీసీ విజయ్ కుమార్ కిడ్నాప్‌ ఆరోపణలు.. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం: నిసార్ అహమ్మద్

కమ్మవారిపల్లి ఎంపీటీసీ విజయ్ కుమార్ కిడ్నాప్‌ ఆరోపణలు.. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం: నిసార్ అహమ్మద్

Kammavaripalli MPTC Vijay Kumar Kidnapping Allegations – Nisar Ahmed Announces Police Complaint

మదనపల్లె | వారధి న్యూస్: ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో గెలవలేక కూటమి నాయకులు అక్రమ మార్గాలను ఆశ్రయిస్తున్నారని మదనపల్లె వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఎస్. నిసార్ అహమ్మద్ ఆరోపించారు. కమ్మవారిపల్లి ఎంపీటీసీ విజయ్ కుమార్‌ను కిడ్నాప్ చేసి, డబ్బులకు అమ్ముడుపోయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

శనివారం మదనపల్లె టౌన్ అవెన్యూ రోడ్డులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో కిడ్నాప్‌కు గురైనట్లు ఆరోపిస్తున్న ఎంపీటీసీ విజయ్ కుమార్‌తో కలిసి నిసార్ అహమ్మద్ విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామసముద్రం మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజాబలంతో గెలవలేక అడ్డదారులు తొక్కుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఎన్నికల్లో స్పష్టమైందని అన్నారు.

మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రం మండలం వైఎస్సార్‌సీపీకి బలమైన ప్రాంతమని, అక్కడ గెలుపు కోసం కుట్రలు చేశారని ఆరోపించారు. కిడ్నాప్ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. బెంగళూరులో జరిగినట్లు చెబుతున్న కిడ్నాప్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని సేకరిస్తున్నామని, ఆధారాలతో పోలీసులను ఆశ్రయించి బాధ్యులపై చర్యలు తీసుకునేలా ప్రయత్నిస్తామని చెప్పారు.

కమ్మవారిపల్లి ఎంపీటీసీ విజయ్ కుమార్‌కు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని నిసార్ అహమ్మద్ స్పష్టం చేశారు.

కిడ్నాప్‌పై ఎంపీటీసీ విజయ్ కుమార్ ఏమన్నారంటే..

తాను నైతిక విలువలు కలిగిన వ్యక్తినని, డబ్బులకు అమ్ముడుపోయే ప్రసక్తే లేదని కమ్మవారిపల్లి ఎంపీటీసీ విజయ్ కుమార్ అన్నారు. తనను రామసముద్రం టీడీపీ అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్, ఆయన అనుచరులే కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.

ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం తనను కిడ్నాప్ చేసి వివిధ ప్రాంతాల్లో తిప్పారని, చివరకు 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు మదనపల్లెలో వదిలి వెళ్లారని వివరించారు. పార్టీ మారాలని తనపై ఒత్తిడి తీసుకొచ్చారని, పలు ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. తాను జీవితాంతం వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతానని చెప్పడంతో మదనపల్లెలో వదిలివెళ్లారని తెలిపారు.

తాను డబ్బులకు అమ్ముడుపోలేదని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారు ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. తన ఫోన్, కాల్ లిస్ట్‌ను పరిశీలించుకోవచ్చని, అవసరమైతే ఎక్కడైనా ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని విజయ్ కుమార్ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News

- Advertisment -
Google search engine

Most Popular

హైదరాబాద్

- Advertisment -
Google search engine
- Advertisment -
Google search engine