Homeరాజకీయాలుకురవల్లిలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, కార్యకర్తల చేరిక

కురవల్లిలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, కార్యకర్తల చేరిక

TDP leaders and party workers join YSR Congress Party in Kuravalli

ఆలూరు నియోజకవర్గం | కురవల్లి: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని కురవల్లి గ్రామంలో టీడీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి తనయుడు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి బుసినే చంద్రశేఖర్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

గంగప్ప జ్యోతి, గంగప్ప రమేష్, శేఖన్న, వన్నూర్ స్వామి, హనుమంతు, చిన్న, బొజ్జప్ప, మల్లప్ప, శాంతి తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో ఉన్నారు.

ఈ సందర్భంగా బుసినే చంద్రశేఖర్ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై నమ్మకంతో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ స్వాగతం పలికారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.

కురవల్లి గ్రామంలో జరిగిన ఈ చేరికలతో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల్లో రాజకీయంగా కొత్త చర్చకు తెరలేచింది. పార్టీలో చేరిన వారితో గ్రామస్థాయిలో పార్టీ కార్యకలాపాలు మరింత విస్తరించనున్నాయని స్థానిక నాయకులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News

- Advertisment -
Google search engine

Most Popular

హైదరాబాద్

- Advertisment -
Google search engine
- Advertisment -
Google search engine