
తిరుమల | వారధి న్యూస్:తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం భక్తులు 25 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల తర్వాత క్యూలైన్లోకి ప్రవేశించే భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది.
నిన్నటి దర్శన వివరాలు:
- స్వామివారిని దర్శించుకున్న భక్తులు: 77,092
- తలనీలాలు సమర్పించిన భక్తులు: 27,615
- హుండీ ఆదాయం: రూ.4.55 కోట్లు
- విక్రయించిన లడ్డూలు: 4.19 లక్షలు
- అన్నప్రసాదం స్వీకరించిన భక్తులు: 1.81 లక్షలు
- వైద్య చికిత్స పొందిన భక్తులు: 2,680
భక్తులు తిరుమలకు వచ్చే ముందు దర్శన సమయాలు, రద్దీ పరిస్థితులను గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఓం నమో వేంకటేశాయ! 🙏













