
హైదరాబాద్ | బి.ఎన్.రెడ్డి నగర్ |వారధి న్యూస్: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను ఎల్బీనగర్ అసెంబ్లీ ఇన్‌చార్జి సామ రంగారెడ్డి, బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ జీహెచ్‌ఎంసీ తాజా మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి సందర్శించారు.
ఈ సందర్భంగా జక్కిడి నగర్ కాలనీ, శ్రీ శ్రీనివాస కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలకు వారు చేరుకుని గణనాథుడిని దర్శించుకున్నారు. మండపాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొందారు. భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను వారు పరిశీలించారు.
మండపాల నిర్వాహకులతో మాట్లాడిన సామ రంగారెడ్డి, మొద్దు లచ్చిరెడ్డి ఉత్సవాల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా, భక్తి భావంతో కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పిట్ట శ్రీనివాస్‌రెడ్డి, రామేశ్వర్, సునీల్, కిషోర్, ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.














