
హైదరాబాద్ | నాగోల్ | వారధి న్యూస్ |:: నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 118 జీవోతో పాటు నియోజకవర్గంలో నెలకొన్న ఇతర సమస్యలపై గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి సుధీర్‌రెడ్డి చర్చించారు. ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సుధీర్‌రెడ్డి తెలిపారు. తాజాగా ఎల్బీనగర్ ప్రజలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం స్పందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సమస్యలపై తప్పుడు సమాచారం, అపోహలు వ్యాప్తి చేసి ప్రజల్లో ఆందోళన కలిగించే ప్రయత్నాలు జరిగినప్పటికీ, వాస్తవాలు చివరకు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తన పోరాటం, కృషి నిరంతరం కొనసాగుతుందని సుధీర్‌రెడ్డి స్పష్టం చేశారు.














