గణేష్ మండపాల వద్ద పోలీసుల వినూత్న కార్యక్రమం

నాగోల్, మహానది న్యూస్, సెప్టెంబర్ 16: గణేష్ ఉత్సవాల సందర్భంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీపీ సుమతి, ఐపీఎస్ చేపట్టిన ‘గణేష్ సురక్ష సంకల్ప్–2025’ కార్యక్రమంలో భాగంగా గణేష్ మండపాల వద్ద డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నాగోల్ ఇన్స్పెక్టర్ మక్బూల్ జానీ ఆధ్వర్యంలో బ్లైండ్స్ కాలనీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ (ఎస్‌హెచ్‌జీ) మహిళలతో కలిసి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, కుటుంబపరమైన దుష్పరిణామాలను వివరిస్తూ యువత వాటికి దూరంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ట్రాఫిక్ డీసీపీ వి. శ్రీనివాసులు, టీఎస్ న్యాబ్ ఈగల్ టీమ్స్ డీఎస్పీ శ్రీనివాస్, నాగోల్ ఎస్ఐ ఉమాతో పాటు ఎస్‌హెచ్‌జీ సభ్యులు ఉమా, పుష్ప, కవిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. డ్రగ్స్ నిర్మూలనలో పోలీసులకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.











