Homeఆంధ్రప్రదేశ్చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష.. రూ.95 లక్షల జరిమానా

చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష.. రూ.95 లక్షల జరిమానా

Bandla Ganesh sentenced to one year in jail in cheque bounce case, fined Rs 95 lakh

ఒంగోలు | వారధి న్యూస్:ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌కు చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు ఏడాది సాధారణ జైలు శిక్ష విధించింది. దీంతోపాటు రూ.95 లక్షల జరిమానా చెల్లించాలని, బాధితుడి న్యాయపరమైన ఖర్చులను కూడా భరించాలని ఆదేశించింది.

2018లో తీసుకున్న అప్పు.. బౌన్స్ అయిన చెక్

ప్రకాశం జిల్లా మద్దిరాలపాడుకు చెందిన జానకి రామయ్య వద్ద 2018లో బండ్ల గణేశ్ రూ.95 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు సమాచారం. జానకి రామయ్య మరణించిన తర్వాత ఆయన తండ్రి జెట్టి వెంకటేశ్వర్లుకు తన నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో రూ.95 లక్షలకు చెక్ ఇచ్చారు. అయితే బ్యాంకు ఖాతాలో తగినంత నగదు లేకపోవడంతో చెక్ బౌన్స్ అయింది. దీంతో జెట్టి వెంకటేశ్వర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఈ కేసును విచారించిన ఒంగోలు కోర్టు ఆధారాలను పరిశీలించి బండ్ల గణేశ్‌ను దోషిగా నిర్ధారించింది. ఏడాది సాధారణ జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

అప్పీల్‌కు నెల రోజుల గడువు

కోర్టు తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేసేందుకు బండ్ల గణేశ్‌కు నెల రోజుల గడువు ఇచ్చినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.

న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది: బండ్ల గణేశ్

తీర్పుపై స్పందించిన బండ్ల గణేశ్.. భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థపై తనకు పూర్తి గౌరవం ఉందని తెలిపారు. న్యాయం కోసం జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశం రాజ్యాంగం కల్పించిందని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకంతో ముందుకు సాగుతానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

సినీ పరిశ్రమలో నిర్మాతగా, నటుడిగా గుర్తింపు పొందిన బండ్ల గణేశ్‌కు సంబంధించిన ఈ తీర్పు ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News

- Advertisment -
Google search engine

Most Popular

హైదరాబాద్

- Advertisment -
Google search engine
- Advertisment -
Google search engine