
ప్రతి స్థానంలోనూ పార్టీ అభ్యర్థి బరిలో ఉంటారు.. కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించాలి
చిన్నగంజాం | వారధి న్యూస్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులందరూ కలిసికట్టుగా పనిచేసి ఘన విజయం సాధించాలని పర్చూరు నియోజకవర్గ ఇంచార్జ్, రాష్ట్ర కార్యదర్శి గాదె మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. చిన్నగంజాం మండల కన్వీనర్ కోడూరు గోవిందు ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ప్రతి స్థానంలోనూ పార్టీ అభ్యర్థి పోటీ
ఈ సందర్భంగా గాదె మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మండల పరిధిలోని ప్రతి స్థానంలోనూ పార్టీ అభ్యర్థిని బరిలోకి దించుతామని తెలిపారు. ఎక్కడా రాజీ పడకుండా ఎన్నికలను ఎదుర్కొంటామని పేర్కొన్నారు.
సమష్టి కృషితో విజయమే లక్ష్యం
చిన్నగంజాం మండలంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలని గాదె మధుసూదన్ రెడ్డి సూచించారు. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, పరస్పర సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు. వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి, పార్టీ విజయమే లక్ష్యంగా అందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మండల కన్వీనర్ కోడూరు గోవిందుతో పాటు మండలంలోని పలు గ్రామాల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.













