
రూ.300 శీఘ్రదర్శనానికి 3-5 గంటలు.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,723 మంది భక్తులు
తిరుమల | వారధి న్యూస్: అక్టోబర్ 1
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం ఏర్పాటు చేసిన అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోగా, భక్తులు ఆక్టోపస్ బిల్డింగ్ వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు.
ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనం క్యూలోకి వెళ్లే భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 22 నుంచి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ సమాచారం. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు 3 నుంచి 5 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 5 నుంచి 7 గంటల సమయం పడుతోంది.
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,723 మంది
బుధవారం మొత్తం 78,723 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 37,664 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
శ్రీవారి హుండీ ద్వారా రూ.4.63 కోట్ల ఆదాయం లభించింది. అదే రోజు 4.48 లక్షల లడ్డూలను విక్రయించినట్లు సమాచారం.
అన్నప్రసాదాలను 3.04 లక్షల మంది భక్తులు స్వీకరించారు.
ఓం నమో వేంకటేశాయ 🙏












