
హైదరాబాద్ | వారధి న్యూస్:తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ ఇన్‌చార్జిగా నియమితులైన బి.ఎం. సందీప్ కుమార్ తొలిసారిగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌లో ఆయనకు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పుష్పగుచ్ఛం అందించి నూతన ఏఐసీసీ ఇన్‌చార్జికి స్వాగతం తెలిపారు.
అలాగే టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ప్రోటోకాల్ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్, కాంగ్రెస్ నాయకులు రోహిన్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య , అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ పాల్గొని సందీప్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గాంధీభవన్‌కు చేరుకుని నూతన ఏఐసీసీ ఇన్‌చార్జికి స్వాగతం పలికారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపడం లక్ష్యంగా సందీప్ కుమార్ నియామకానికి ప్రాధాన్యత ఏర్పడింది. అనంతరం గాంధీభవన్‌లో నిర్వహించిన పీఏసీ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, పార్టీ ముఖ్య నాయకులతో పాటు డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ హాజరయ్యారు.













