Homeతెలంగాణఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంతో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంతో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా

Indiramma Family Life Insurance Scheme providing financial security to poor families in Telangana
  • అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ
  • జిల్లాలోని 335 గ్రామపంచాయతీలు, 2 మున్సిపాలిటీల పరిధిలో అర్హుల గుర్తింపునకు ప్రత్యేక కార్యాచరణ
  • జిల్లా కలెక్టర్ కె. హరిత, ఐ.ఎ.ఎస్.


వారధి న్యూస్:రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించి, కుటుంబ పెద్దను కోల్పోయిన సందర్భంలో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా అండగా నిలవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు.

కుటుంబంలో ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వ్యక్తి అనుకోకుండా మరణించినప్పుడు ఆ కుటుంబం ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను తగ్గించి, వారి జీవన భద్రతకు భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు 5 లక్షల రూపాయల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు.

18 నుంచి 59 సంవత్సరాల వయస్సు వారికి అర్హత

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన అర్హులైన వ్యక్తులు అర్హత పొందుతారని తెలిపారు. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకొని కుటుంబ వివరాలను పరిశీలించడం జరుగుతుందని తెలిపారు.  జనాభా లెక్కల సేకరణ వివరాలు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని, ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు ఆధారంగా వివరాలు సేకరించడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

335 గ్రామపంచాయతీలు, 2 మున్సిపాలిటీల పరిధిలో ప్రత్యేక కార్యాచరణ

జిల్లాలోని 335 గ్రామపంచాయతీలు, 2 మున్సిపాలిటీల పరిధిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో గ్రామపంచాయతీల వారీగా, పట్టణ ప్రాంతాలలో మున్సిపల్ వార్డుల వారీగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారి వివరాలను సేకరించడం జరుగుతుందని తెలిపారు. జనాభా, వార్డులు/గ్రామపంచాయతీల సంఖ్య ఆధారంగా శిబిరాలు నిర్వహించి లబ్ధిదారుల వివరాలు, సంతకంతో కూడిన దరఖాస్తు పత్రాలను స్కాన్ చేసి సంబంధిత బీమా సంస్థకు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. అధికారులు లబ్ధిదారుల వివరాలు సేకరించిన తర్వాత ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతుందని, ఈ పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని వివరాలు అందించవలసి ఉంటుందని తెలిపారు. కార్యచరణ ప్రణాళికలో భాగంగా లబ్ధిదారులకు ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంలో చోటు కల్పించడం జరుగుతుందని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాలలో పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల అధికారులు, పట్టణ ప్రాంతాలలో మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అర్హుల వివరాల సేకరణ, పరిశీలన ప్రక్రియను చేపట్టాలని సూచించారు. ప్రత్యేక శిబిరాల ద్వారా ప్రజలకు పథకంపై అవగాహన కల్పిస్తూ, అర్హులైన వారి వివరాలను సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు.

వివరాల నమోదు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంలో వివరాల నమోదు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని, మొదట జిల్లా పేరు, ఆ తర్వాత మున్సిపాలిటి, మండలం, గ్రామం, వార్డు పేర్లను నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పథకంలో వర్తించే బీమాదారునిగా కుటుంబపెద్ద పోషకుడు, తండ్రి / భర్త పేరు నమోదు చేసి కుటుంబసభ్యుల పేర్లు, బంధుత్వం వివరాలు నమోదు చేయవలసి ఉంటుందని, భవిష్యత్తులో బీమా మొత్తం చెల్లించేందుకు వీలుగా నామినీ పేరు, ప్రతిపాదకులు నియమించిన వ్యక్తి బీమాదారులతో ఉన్న సంబంధం, ఆధార్ సంతకం, చివరగా అధికారిక సంతకం ప్రక్రియతో లబ్ధిదారుని సంతకాన్ని కంప్యూటర్ లో నిక్షిప్తం చేస్తారని తెలిపారు.

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందాలి

జిల్లాలోని మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలలో నివసించే అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకం ప్రయోజనాలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రజలకు పథకం అర్హతలు, అవసరమైన వివరాలపై అవగాహన కల్పించాలని, అర్హుల గుర్తింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అర్హుల వివరాల సేకరణ, పరిశీలన ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.

పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పిస్తూ, అనుకోని ఆపద సమయంలో వారికి అండగా నిలిచే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా అధికారులు బాధ్యతతో పని చేయాలని తెలిపారు.

కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారిచే జారీ చేయడమైనది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News

- Advertisment -
Google search engine

Most Popular

హైదరాబాద్

- Advertisment -
Google search engine
- Advertisment -
Google search engine