Homeభక్తి/ఆధ్యాత్మికంతిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18-20 గంటలు

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18-20 గంటలు

ఉచిత దర్శనం కోసం శిలాతోరణం వరకు క్యూ.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 83,578 మంది

తిరుమల | వారధి న్యూస్: సెప్టెంబర్ 28

తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం ఏర్పాటు చేసిన అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్‌లో వేచి ఉన్నారు.

సోమవారం ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనం కోసం క్యూలోకి వెళ్లే భక్తులకు సుమారు 18 నుంచి 20 గంటల సమయం పడుతోందని తిరుమల సమాచారం.

అదేవిధంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (శీఘ్రదర్శనం) కోసం వచ్చే భక్తులకు సుమారు 3 నుంచి 5 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు దర్శనానికి సుమారు 5 నుంచి 7 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.07 కోట్లు

ఇక సోమవారం విడుదలైన తిరుమల సమాచారం ప్రకారం.. ఆదివారం శ్రీవారిని 83,578 మంది భక్తులు దర్శించుకున్నారు.

31,137 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా శ్రీవారికి రూ.5.07 కోట్ల ఆదాయం సమకూరింది.

భక్తుల కోసం మొత్తం 4.39 లక్షల లడ్డూలను విక్రయించారు. అలాగే 2.88 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు.

ఇక తిరుమలలో 3,631 మంది భక్తులు వైద్య చికిత్స పొందినట్లు అధికారులు వెల్లడించారు.

తిరుమలలో భక్తుల పరిస్థితి

  • సర్వదర్శనం: సుమారు 18–20 గంటలు
  • రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం: సుమారు 3–5 గంటలు
  • సర్వదర్శనం టోకెన్: సుమారు 5–7 గంటలు
  • నిన్న దర్శనం చేసుకున్న భక్తులు: 83,578 మంది
  • తలనీలాలు సమర్పించిన వారు: 31,137 మంది
  • హుండీ ఆదాయం: రూ.5.07 కోట్లు
  • విక్రయించిన లడ్డూలు: 4.39 లక్షలు
  • అన్నప్రసాదం స్వీకరించిన వారు: 2.88 లక్షలు
  • వైద్య చికిత్స పొందిన వారు: 3,631 మంది

🙏 ఓం నమో వేంకటేశాయ 🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News

- Advertisment -
Google search engine

Most Popular

హైదరాబాద్

- Advertisment -
Google search engine
- Advertisment -
Google search engine