బీఆర్‌ఎస్ నాయకుడు సూర్యప్రకాశ్‌రావు, కాంగ్రెస్ నాయకుడు నంబి శంకర్ ల సమక్షంలో క్షేత్రస్థాయి సర్వే.. హద్దురాళ్ల ఏర్పాటు.

ప్రభుత్వ కుంటలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
కల్వకుర్తి | వారధి న్యూస్: గుండూర్ గ్రామ పరిధిలోని నీటిపారుదల శాఖకు చెందిన అవుసలి కుంట, కమ్మరి కుంటల హద్దులను అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి నిర్ధారించారు. సర్వే నంబర్లు 157, 158లో ఉన్న రెండు కుంటల పరిధిని ప్రభుత్వ రికార్డుల ఆధారంగా పరిశీలించి, హద్దులను కొలిచి గుర్తించారు.
గుండూర్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు సూర్యప్రకాశ్‌రావు, కాంగ్రెస్ నాయకుడు నంబి శంకర్, ఇతర గ్రామ పెద్దల సమక్షంలో ఈ సర్వే ప్రక్రియ కొనసాగింది.
ప్రభుత్వ సర్వేయర్ హరీష్‌రెడ్డి, ఇరిగేషన్ ఏఈ వంశీ ఆధ్వర్యంలో అధికారులు కుంటల పరిధిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, కొలతలు చేపట్టారు. సర్వే అనంతరం నిర్ధారించిన సరిహద్దులను స్పష్టంగా గుర్తించేలా కుంటల హద్దుల్లో హద్దురాళ్లను ఏర్పాటు చేశారు. దీంతో అవుసలి కుంట, కమ్మరి కుంటల సరిహద్దులపై స్పష్టత ఏర్పడింది.
కుంటల హద్దులు స్పష్టంగా ఉండటంతో భవిష్యత్‌లో హద్దులకు సంబంధించిన అపోహలు, వివాదాలకు తావులేకుండా ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ నీటి వనరులను పరిరక్షించడంలో భాగంగా కుంటల పరిధిని నిరంతరం పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు.
ప్రభుత్వ కుంటలు, వాటికి సంబంధించిన శిఖం భూములను ఎవరైనా ఆక్రమించేందుకు ప్రయత్నించినా, ప్రభుత్వ భూముల్లో అనధికార నిర్మాణాలు లేదా ఇతర కార్యకలాపాలకు పాల్పడినా నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. కుంటల పరిరక్షణకు గ్రామస్థులు కూడా సహకరించాలని వారు సూచించారు.
ఈ క్షేత్రస్థాయి సర్వేలో మాజీ సర్పంచ్ వెంకటయ్య, ఎన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నంబి వెంకటయ్య, పోతరపల్లి శేఖర్, పోతరపల్లి పరశురాములు, పోతుగంటి చిన్న నాగేంద్రం, తుప్పలి సత్యనారాయణ, మెంట భీమయ్య, బాషమోని ఎల్లయ్య, ప్రతాపరెడ్డి, మెంట నాగయ్య, కుమ్మరి జానయ్య, దేవేందర్ రావు, కుమ్మరి బాలరాం, కుమ్మరి సతీష్, మెంట పర్వతాలు, మెంట లింగం, బాషమోని, సాయిబాబు, బాషమోని శంకర్, మెంట భగవంతు, బాషమోని వెంకటయ్య, ఉప్పరి నరేందర్, తుంగభద్ర వెంకటయ్య, మంగలి పాండు, మెంట బీరప్ప, ఉప్పరి కవి, వడ్డే లక్ష్మయ్య, నంబి వెంకటయ్య, వలిగేష్, వార్డు మెంబర్ రాజేందర్, బాషమోని జాని, పోతరపల్లి కృష్ణయ్య, బుడ్డకుంట లక్ష్మయ్య, మెంట సాంబశివుడు, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.













