
తిరుమల | వారధి న్యూస్: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ ప్రస్తుతం సాధారణంగా కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం మొత్తం 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల తర్వాత క్యూలోకి ప్రవేశించే భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి సుమారు 6 నుంచి 8 గంటల సమయం పడుతోంది.
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు స్వామివారి దర్శనం 1 నుంచి 2 గంటల్లో పూర్తవుతోంది.
గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తుల వివరాలు:
- స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య: 65,218
- తలనీలాలు సమర్పించిన భక్తులు: 20,213
- హుండీ ద్వారా వచ్చిన ఆదాయం: రూ.3.63 కోట్లు
- విక్రయించిన లడ్డూల సంఖ్య: 3.94 లక్షలు
- వైద్య చికిత్స పొందిన భక్తులు: 1,995
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు క్యూలైన్లలో ఓపికగా వేచి ఉండాలని, టీటీడీ సూచనలు పాటించాలని కోరుతున్నారు.
ఓం నమో వేంకటేశాయ! 🙏













