
గద్వాల: పట్టణంలోని బసవన్న చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పృథ్వీ బిగ్ మార్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ గొంగళ్ళ రంజిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించిన పృథ్వీ బిగ్ మార్ట్ యజమాని బాలు మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
గద్వాల పట్టణంలో నూతన వ్యాపార సంస్థలు ప్రారంభం కావడం స్థానికంగా వ్యాపార కార్యకలాపాల అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులు మీసాల కిష్టన్న, విష్ణు, గోపాల్,కార్తీక్,ప్రేమ్ రాజు, రంగస్వామి,తదితరులు పాల్గొన్నారు.












