
మా ఆధ్వర్యంలో గత 2018 నుండి కొనసాగుతున్న గొందిమల్ల-వెల్టూర్ బ్యారేజ్ కం రోడ్ బ్రిడ్జి పోరాటంలో రెండు భారీ ప్రాజెక్టులు దాగి ఉన్నాయి..
అందులో మొదటిది రోడ్డు బ్రిడ్జి ప్రయోజనం కాగా,
రెండవది కృష్ణానది లో తెలంగాణ రాష్ట్ర నీటి వాటా వినియోగo కోసం జోగులాంబ బ్యారేజీ నిర్మాణం.!
దక్షిణ భారతదేశంలో పడమటి అరేబియా సముద్రం నుండి తూర్పు బంగాళాఖాతం వరకు పోర్టులను లింకు చేసే జాతీయ రహదారి గా ప్రయోజనం!
గుoదిమళ్ళ- వెల్టూరు రోడ్డు బ్రిడ్జి పై సమగ్ర వివరణ.!
కృష్ణానది పై శ్రీశైలం డ్యాం ప్రాజెక్టు కట్టడానికి కంటే ముందుగా..
తెలంగాణ లో
కొల్లాపూర్, అలంపూర్,
వనపర్తి నియోజకవర్గాలు..
ఆంధ్రప్రదేశ్ లో
ఆత్మకూరు, నందికొట్కూరు, కర్నూలు నియోజకవర్గాలు..
పై నియోజకవర్గాల పరిధిలో కృష్ణానదికి అటువైపు, ఇటువైపు సామాజిక సంబంధాలు, బంధుత్వాలు ఎక్కువగా ఉన్నాయి.
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణo అనంతరం 1980 తర్వాత అటువైపు,ఇటువైపు ఉన్న ప్రజల మధ్య శ్రీశైలం బ్యాక్ వాటర్ కృష్ణానది నీళ్లు వేరు చేస్తూ.. సామాజిక, ఆర్థిక, మార్కెటింగ్ సంబంధాలను కట్టడి చేసింది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 200 కిలోమీటర్లు ప్రయాణిస్తున్న కృష్ణా నది పై 4 రోడ్ బ్రిడ్జి లు మాత్రమే కలవు…
1) మక్తల్ దగ్గర కృష్ణా నదిపై కృష్ణ బ్రిడ్జి.
2) జూరాల డ్యామ్ పై రోడ్ రహదారి.
3) జాతీయ రహదారి 44 పై బీచుపల్లి బ్రిడ్జి.
4) శ్రీశైలం డ్యాం దిగువన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య రోడ్డు బ్రిడ్జి.
పై 4 మాత్రమే మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాయి. ముఖ్యంగా శ్రీశైలం నుండి బీచుపల్లి (160 KM) వరకు నదీతీరంలో శ్రీశైలం బ్యాక్ వాటర్ ముంపు లో నిర్వాసితులుగా మిగిలిపోయి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజల సామాజిక, ఆర్థిక, మార్కెటింగ్, రవాణా సంబంధాలు చిన్న భిన్నమైనవి. వారిని కలిపే అభివృద్ధికి సంబంధించిన రోడ్డు బ్రిడ్జి లు కట్టే ఆలోచన ఏ రోజు ప్రభుత్వాలు చేయలేదు.
నేడు శ్రీశైలం నిర్వాసితుల నియోజకవర్గాలైనా మహబూబ్ నగర్ ,కర్నూలు జిల్లా లోని ప్రధాన పట్టణాలను కలుపుతూ…
గుoదిమల్ల- వెల్లటూరు బ్రిడ్జి
నిర్మాణo చాలా ముఖ్యమైనది. అందుకు సంబంధించిన వివిధ పట్టణాల మధ్య దూరం మరియు అభివృద్ధి సంబంధించిన విషయాలపై పరిశీలన చేస్తే ఏ రోడ్డు తో ప్రయాణం చేస్తే,ఎంత దూరం ఉంటుందో..!తదితర సాధ్యాసాధ్యాలను పరిశీలిద్దాం.!
1) రూట్-1: కొల్లాపూర్– చిన్నంబావి—పెబ్బేర్— ఎర్రవల్లి— కర్నూల్.=100km.
2) రూట్-2: కొల్లాపూర్- చిన్నంబావి- వెల్లటూరు- గుoదిమళ్ళ- అలంపూర్ -కర్నూల్ =55km.
3) రూట్-3: కొల్లాపూర్ చిన్నంబావి-
గుoదిమళ్ళ- అలంపూర్ – నందికొట్కూరు నగరానికి=52km
పై రూట్లలో 2వ,3వ రూట్ చూస్తే, కర్నూల్ ,నందికొట్కూరు నగరానికి తక్కువగా దూరంగా ఉంటున్నాయి.
కృష్ణా నదిపై రోడ్డు బ్రిడ్జి ద్వారా వెల్లటూరు -గుందిమల్ల మీదుగానే తక్కువ దూరం అవుతుంది.
అలాగే ఈ పై రూట్లో
మూడు జిల్లాలు.
1)నాగర్ కర్నూల్
2)వనపర్తి,
3)గద్వాల
మూడు రాష్ట్రాలు
1) తెలంగాణ
2 ఆంధ్ర ప్రదేశ్
3)అలంపూర్ నుండి రాయచూరు రోడ్డు కలిగిన 98km కర్ణాటక రాష్ట్రాని కలుపుకుపోయే విశిష్టత కలిగిన రోడ్ బ్రిడ్జిగా!,
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం గుందిమల్ల, వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం వెల్టూరు ఉభయ గ్రామల మధ్యలో ఉన్న కృష్ణా నదిపై రోడ్డు బ్రిడ్జి ప్రసిద్ధి…!
అలంపూర్ పట్టణానికి అన్ని వైపులా డబల్ రోడ్లు కలవు…
కొల్లాపూర్ పట్టణానికి అన్ని వైపులా డబల్ రోడ్లు కలవు…
వెల్టూరు -గుందిమల్ల రూట్లో మాత్రమే, అది కూడా చిన్నంబావి నుండి ఆలంపూర్ వరకు ఇప్పటికే ఉన్న 16 కిలోమీటర్ల సింగల్ రోడ్డును డబుల్ రోడ్డు గా మార్చి కృష్ణా నదిపై రోడ్డు బ్రిడ్జి నిర్మాణం చేయడమే వెల్టూర్ -గుందిమల్ల రోడ్డు బ్రిడ్జి యొక్క ఉద్దేశం.
కాబట్టి రెండు నియోజక వర్గాల ప్రజలారా! విద్యా ,వైద్య, వ్యాపార ,పారిశ్రామిక, ఆర్థిక, మార్కెటింగ్, సామాజిక సంబంధాల వృద్ధికై మేము అడుగుతున్న 16 కిలోమీటర్ల డబుల్ రోడ్డు కం రోడ్డు బ్రిడ్జి మాత్రమే కావున….!
ఈ ఉద్యమంపై ఉమ్మడి వీపనగండ్ల , చిన్నంబావి, కొల్లాపూర్,లింగాల,అచ్చంపేట ప్రజలు మరియు అలoపూర్, వడ్డేపల్లి, ఐజ, మండల ప్రజలు,కర్ణాటక రాష్ట్రం,ఆంధ్రప్రదేశ్ కలిసి ఉద్యమించవలసిన సమయం ప్రస్తుతం కలదు.
కాబట్టి ప్రభుత్వం దృష్టికి ఈ ప్రాజెక్టు ఉద్దేశాన్ని తీసుకెళ్లి ఉమ్మడి జిల్లాలో వెనకబాటుకు గురైన కొల్లాపూర్, అలoపూర్ అభివృద్ధి చేసుకుందాం! అని తెలియజేస్తూ…..
కర్ణాటకలోని సముద్ర తీరం నుంచి నుంచి.. రాయచూరు- -అయిజ–వడ్డేపల్లి– అలంపూరు – గుoదిమళ్ళ- -వెల్లటూరు చిన్నంబావి- పెంట్లవెల్లి- -కొల్లాపూర్-నార్లాపూర్ – యాపట్ల- లింగాల-అచ్చంపేట-దేవరకొండ-నల్లగొండ, కృష్ణపట్నం వరకు… అనేక జాతీయ రహదాలను
NH- 40 కర్నూల్.
NH- 44.అలoపూర్
NH-167. దేవరకొండ
NH-167K. కొల్లాపూర్
NH-765.దిండి
NH-65 నల్లగొండ
కలుపుతూ.. సుమారు 220 పైబడి కిలోమీటర్లు రోడ్డు భవిష్యత్తులో జాతీయ రహదారిగా కొల్లాపూర్ పట్టణం మీదుగా రెండు జాతీయ రహదారులు ఇప్పటికే NH- 167K, మరో కొత్త చిన్నంబావి NH, జాతీయ రహదారులు కలవడంతో ఒక పెద్ద X జంక్షన్ గా భారీ అభివృద్ధిలోకి, కొల్లాపూర్ పట్టణం వస్తుంది.
కాబట్టి కొల్లాపూర్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ఈ వంతెన నిర్మించాల్సిన ఆవశ్యకత ఉంది..!
దక్షిణ భారతదేశంలో తూర్పు నుంచి పడమటికి బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రాలను కలిపే పోర్టులను లింకు చేసే రోడ్డు రవాణా మార్గంగా..! పరిగణించవచ్చు…
పోరాడుదాం! సాధించుకుందాం!
ఇట్లు
పెరుమాళ్ళ శ్రీనివాస్ జర్నలిస్ట్
గుoదిమళ్ళ -వెల్లటూరు రోడ్ 🛣️ బ్రిడ్జి సాధన సమితి,












